Home  »  TV News  »   శ్రీధర్ ఆరోగ్య పరిస్థితిపై కార్తీక్ ఆందోళన, జ్యోత్స్నకు సూరజ్ సవాల్!

Updated : Jun 6, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -690 లో..... దీపతో కలిసి పని చెయ్యడానికి సూరజ్ వస్తాడు. సూరజ్ ని చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. దీప, సూరజ్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తుంటారు. జ్యోత్స్న పక్కన ఉన్నా కార్తీక్.. నేను కాఫీ కోసం వెళ్తున్నాను.. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే రావొచ్చని ఇండైరెక్ట్ గా దీపకి చెప్పి వెళ్తాడు. దీప కూడా వెళ్తుంది. ఆ తర్వాత సూరజ్, జ్యోత్స్న మాటల్తో యుద్ధం చేస్తారు. నీకున్న పొగరుని తగ్గించడానికే వచ్చాను.. దీప గారిని గెలిపిస్తానని సూరజ్ సవాలు విసురుతాడు.

అదంతా దీప, కార్తీక్ చూస్తారు. అబ్బ ఎంత బాగుందో సూరజ్ అలా మాట్లాడుతుంటే చెప్పాలంటే జ్యోత్స్నకి వాడే కరెక్ట్ మొగుడు అని కార్తీక్ అంటుంటే.. ఊరుకో బావ వింటారని దీప అంటుంది. అప్పుడే కార్తీక్ కి ఫోన్ వస్తుంది. అది మాట్లాడుతూ షాక్ అవుతాడు. వెంటనే వస్తానని చెప్తాడు. ఏమైందని దీప అడుగుతుంది. నాన్నకి మళ్ళీ హార్ట్ స్టోక్ వచ్చిందని కార్తీక్ చెప్తాడు. దాంతో ఇద్దరు హాస్పిటల్ కి వెళ్తారు. ఆ తర్వాత శివన్నారాయణ, కార్తీక్, దశరథ్ ముగ్గురు కలిసి డాక్టర్ తో మాట్లాడతారు‌. ఇప్పుడు ఆపరేషన్ చెయ్యాలి. ఒకవేళ చేసినా బ్రతకడం కష్టమని డాక్టర్ చెప్తాడు. ఈ ట్రీట్ మెంట్ స్పెషలిస్ట్ లు చెయ్యాలని డాక్టర్ చెప్తాడు. సరే అని శివన్నారాయణ అంటాడు. శ్రీధర్ బయటకు వచ్చి డాక్టర్ ఏమన్నాడని అడుగుతాడు. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత అందరు కావేరి ఇంటికి వెళ్తారు. ఆపరేషన్ చెయ్యాలని అంటున్నారు. అమెరికాలో మా ఫ్రెండ్ ఉన్నాడు అన్ని ఏర్పాట్లు చేసాను.‌ శ్రీధర్ తో పాటు కావేరి వెళ్తుందని శివన్నారాయణ చెప్తాడు. అందరు శ్రీధర్ పరిస్థితి చూసి ఎమోషనల్ అవుతారు. మీరు అందరు ఎందుకు బాధ పడుతున్నారు. నాకేం కాదని శ్రీధర్ అందరికి దైర్యం చెప్తాడు.

ఆ తర్వాత శ్రీధర్ పక్కకి వచ్చి ఏడుస్తాడు. కాంచన వచ్చి మీకేం కాదని ధైర్యం చెప్తుంది. నేను మళ్ళీ రాకుంటే అని శ్రీధర్ అంటాడు. అలా అనకండి అని కాంచన అంటుంది. అప్పుడే కార్తీక్, దీప వస్తారు. మీకేం కాదని కార్తీక్ తన తండ్రిని పట్టుకొని ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత కాంచన బాధపడుతుంటే శివన్నారాయణ వచ్చి.. ఈ పాటికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. నువ్వు వాళ్ళ గురించి కంగారు పడకు అని చెప్తాడు. నీకు శ్రీధర్ ఈ వాచ్ ఇవ్వమని చెప్పాడని కాంచనకి శివన్నారాయణ ఇస్తాడు. మీకు ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉందని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.